Coronavirus: భారత రైల్వేశాఖ కీలక ప్రకటన
Coronavirus: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత రైల్వే కీలక ప్రకటన చేసింది.
Coronavirus: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత రైల్వే కీలక ప్రకటన చేసింది. రైల్వే సేవలను ఆపడం గానీ, కుదించడం గానీ చేసే ఆలోచన అస్సలు లేదని స్పష్టం చేసింది. ప్రయాణాలు చేయదలచుకున్నవారికి ట్రైన్ల కొరత లేదని రైల్వే బోర్డ్ చైర్మన్ సునీత్ శర్మ క్లారిటీ ఇచ్చారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సేవలను మరింత విస్తరిస్తామని శర్మ తెలిపారు. లాక్‌డౌన్ విధిస్తారనే ఊహాగానాల మధ్య వేలాది కార్మికులు తమ స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రైలు ప్రయాణం చేసే సమయంలో కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.