Bengaluru: ఈ నెల 17 నాటికి బెంగళూరులో కరోనా పీక్‌ స్టేజ్‌కు..

Bengaluru: కర్నాటక రాజధాని గార్డెన్‌ సిటీ కరోనా కల్లోలంతో చిగురుటాకులా వణుకుతోంది.

Update: 2021-05-11 05:27 GMT

Bengaluru: ఈ నెల 17 నాటికి బెంగళూరులో కరోనా పీక్‌ స్టేజ్‌కు..

Bengaluru: కర్నాటక రాజధాని గార్డెన్‌ సిటీ కరోనా కల్లోలంతో చిగురుటాకులా వణుకుతోంది. బెంగళూరులో కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యుటేషనల్ అండ్ డేటా సైన్సెస్ విడుదల చేసిన నివేదిక ప్రజల్ని మరింత ఆందోళకు గురి చేస్తోంది. ఈ నెల 17 నాటికి బెంగళూరులో కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని నివేదికలో పేర్కొంది.

వచ్చే నెల 11 నాటికి బెంగళూరులో మరో 14 వేల మంది కరోనాతో మరణిస్తారని ఇనిస్టిట్యూట్ నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం, అమల్లో ఉన్న లాక్‌డౌన్ తరహా ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. నమోదవుతున్న ఒక్కో కేసు వెనక, వెలుగులోకి రాని రెండు కేసులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News