ప్లాస్మా థెరఫీతో కోలుకున్న మంత్రి

కరోనా వైరస్‌ భారిన పడిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం మెరుగైంది. ప్లాస్మా థెరపీ తర్వాత ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు.

Update: 2020-06-21 15:53 GMT

కరోనా వైరస్‌ భారిన పడిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం మెరుగైంది. ప్లాస్మా థెరపీ తర్వాత ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు.జ్వరం తగ్గింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న జైన్‌ చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయనను సోమవారం జనరల్‌ వార్డుకు తరలించే అవకాశం ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అధిక జ్వరం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో సత్యేంద్ర జైన్‌ను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు మొదట కరోనా నివేదిక నెగెటివ్ గా వచ్చింది.

ఆ తరువాత రెండు రోజులకే సత్యేంద్ర రెండవసారి కరోనా పరీక్షలు చేయగా నివేదిక పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఆరోగ్యం మరింతగా విషమించింది. అయితే ఈ క్రమంలో ఆయనకు ప్లాస్మా థెరపీ ఇచ్చారు. దాంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సత్యేందర్‌ జైన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి ట్వీటీ చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తన గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం గత 24 గంటల్లో 15413 కేసులు నమోదయ్యాయి. అలాగే 306 మంది రోగులు మరణించారు.


Tags:    

Similar News