వంట నూనెలపై రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. పది రోజుల్లో ఆకాశాన్నంటిన ధరలు
Cooking Oil Price Hike: రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధ ప్రభావంతో.. ఇంట్లో వంట సరుకుల ధరలు కాక పుట్టిస్తున్నాయి.
Cooking Oil Price Hike: రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధ ప్రభావంతో.. ఇంట్లో వంట సరుకుల ధరలు కాక పుట్టిస్తున్నాయి. వంట నూనెల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ ను భారత్ కు సరఫరా చేసే అతిపెద్ద దేశాలైన రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంక్షోభం నెలకొనడంతో వీటి సరఫరా చాలా వరకు ఆగిపోయింది. దీంతో పామాయిల్ కి కూడా డిమాండ్ భారీగా పెరిగింది.
భారత్ లో ఉత్పత్తి అవుతున్న సన్ ప్లవర్ కేవలం 10శాతం జనాభాకి మాత్రమే సరిపోతుంది. అందుకే ఇండియా ఎక్కువగా ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ సామన్యులను ఇబ్బంది పెడుతుంటే.. మరోవైపు వంట నూనెల ధరలు కూడా పెరిగి సామాన్యులకు గుది బండంగా మారింది.
మొత్తానికి దేశంలోనే వంట నూనెల ధరలు ఆకాశాన్నంటాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు సన్ ప్లయర్ ఆయిల్ మార్కెట్ లో 140 రూపాయలు పలికితే.. ప్రస్తుతం లీటర్ సన్ ప్లవర్ ఆయిల్ దాదాపు 200 రూపాయలు పలుకుతుంది.