Rahul Gandhi: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది

Rahul Gandhi: 3 ఏళ్లు సమయం ఉంది పోరాటం చేస్తే విజయం మనదే

Update: 2024-07-06 10:46 GMT

Rahul Gandhi: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది

Rahul Gandhi: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌లో నెల రోజుల క్రితం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా... పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారిని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఎన్నికల సమయంలో దాడి జరిగిన పార్టీ కార్యాలయాన్ని సైతం రాహుల్ సందర్శించారు. ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్నారు. గత ఎన్నికల్లో సరైన పోటీ ఇవ్వలేమని... ఇంకా 3 ఏళ్లు సమయం ఉందని... పోరాటం చేస్తే కాంగ్రెస్‌దే విజయం అన్నారు రాహుల్ గాంధీ.

Tags:    

Similar News