Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ముగిసిన వాదనలు

Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌పై సా.4 గంటలకు ఉత్తర్వులు వెల్లడించనున్న జడ్జి

Update: 2024-03-27 08:47 GMT

Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ముగిసిన వాదన

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సిట్టింగ్‌ సీఎంను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం సరికాదని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్‌ను వెంటనే ఈడీ కస్టడీ నుంచి రిలీజ్ చేయాలని అభిషేక్ మను సింఘ్వీ కోర్టును కోరారు. కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఈడీ అరెస్ట్ జరిగినట్లు కోర్టు ముందు ప్రస్తావించారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 ప్రకారం కేజ్రీవాల్ స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదని తెలిపారు.

కేజ్రీవాల్ ప్రాథమిక మానవ హక్కులను ఈడీ ఉల్లంఘించిందని ఆరోపించారు ఆయన తరపు న్యాయవాది. నేరాన్ని నిర్ధారించడంలో ఈడీ విఫలమైందన్నారు. కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ రాజకీయ పరమైందని ఆరోపించారు అభిషేక్ మను సింఘ్వీ. ఇక కేజ్రీవాల్ పిటిషన్‌పై సాయంత్రం 4 గంటలకు ఉత్తర్వులు వెలువరించనున్నట్లు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ వెల్లడించారు.

ఓ వైపు ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగుతుండగానే సీఎం కేజ్రీవాల్‌పై పిటిషన్ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసింది సీబీఐ. కాగా రేపటితో సీబీఐ కస్టడీ ముగియనుంది.

Tags:    

Similar News