North India: ఉత్తర భారతంపై చలి పంజా
North India: పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న 95 రైళ్లు
North India: తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. IMD ప్రకారం రాత్రి, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఉత్తర భారతం చలికి గజగజ వణుకుతోంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ వరకు దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా 95 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా సమీపంలోని వస్తువులు కూడా కనిపించకుండా పోయాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలోని రోడ్లపై వాహనాలు లైట్ల వెలుతురులో నెమ్మదిగా కదులుతూ కనిపంచాయి.