గొప్ప జడ్జిని కాకపోవచ్చు.. సామాన్యుడికి న్యాయం చేశా.. వీడ్కోలు సభలో CJI NV రమణ భావోద్వేగం..

NV Ramana: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు.

Update: 2022-08-26 14:19 GMT

గొప్ప జడ్జిని కాకపోవచ్చు.. సామాన్యుడికి న్యాయం చేశా.. వీడ్కోలు సభలో CJI NV రమణ భావోద్వేగం..

NV Ramana: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడ్పడవోయ్ అనే గురజాడ సూక్తిని జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే కొద్దికాలంలోనే హింస, వివాదాలకు తావులేని సరికొత్త, స్వచ్ఛమైన ప్రపంచాన్ని చూడగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రపంచం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం ప్రారంభమైందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

సత్యమేవ జయతే అనేది తాను నమ్మే సిద్ధాంతం అన్నారు. తాను గొప్ప జడ్జిని కాకపోవచ్చు.. కానీ సామాన్యులకు న్యాయం జరిగేలా కృషి చేశాననీ వెల్లడించారు. కేసుల పరిష్కారంలో కొత్త పంథా తీసుకొచ్చామన్నారు. మౌలిక వసతుల కల్పనలోనూ తమ వంతు కృషి చేశామన్నారు. సుప్రీం కొలీజియంతో కలిసి 255 మంది జడ్జిల నియామకానికి సిఫార్సు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 224 మంది న్యాయమూర్తుల నియామకం జరిగిందని వెల్లడించారు. న్యాయవాద వృత్తి.. కత్తి మీద సాము లాంటిదన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే జడ్జి ప్రధాన లక్ష్యం కావాలన్నారు. 

Tags:    

Similar News