మమతా కీలక నిర్ణయం .. అక్టోబర్ 01 నుంచి ధియేటర్లు రీ ఓపెన్!

Cinema Halls To Reopen : కరోనాని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అన్ని ఎక్కడికక్కడే స్థంభించిపోయాయి.. అందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, ధియేటర్లు కూడా మూతపడడంతో ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టం చూసింది..

Update: 2020-09-27 12:02 GMT

Cinema halls to reopen in West Bengal

Cinema Halls To Reopen : కరోనాని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అన్ని ఎక్కడికక్కడే స్థంభించిపోయాయి.. అందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, ధియేటర్లు కూడా మూతపడడంతో ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టం చూసింది.. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ.. షూటింగ్ లకు అనుమతి ఇచ్చాయి కానీ ఇంకా ధియేటర్ల రీ ఓపెన్ పైన ఎలాంటి స్పష్టత లేదు!

ఈ క్రమంలో పచ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సినిమా హాళ్లు, ఓపెన్‌-ఎయిర్‌ థియేటర్లు తిరిగి తెరచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టుగా వెల్లడించారు. సీఎం తాజా నిర్ణయంతో ఆ రాష్ట్రములో అక్టోబర్ 01 నుంచి సినిమా ధియేటర్లు ఓపెన్ కానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా థియేటర్లకైనా కేవలం 50 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

ఇక సంగీతం, నృత్యం మరియు మ్యాజిక్ షోలకి కూడా అక్టోబర్ 1 నుండి అనుమతిలు ఇస్తున్నట్టుగా సీఎం వెల్లడించారు. ఈ ప్రకటనతో గత ఆరు నెలలుగా మూతపడి ఉన్న ధియేటర్లు మళ్ళీ తెరుచుకోనున్నాయి. లాక్ డౌన్ తర్వాత ధియేటర్లు పునప్రారంభించిన మొదటి రాష్ట్రముగా పచ్చిమబెంగాల్ నిలిచింది. మార్చి చివరిలో దేశవ్యాప్తంగా కరోనావైరస్ వలన సినిమా హాళ్ళు మూసివేయబడ్డాయి.

ఇక ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,181 కొత్త కేసులు నమోదు అయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,44,240కి చేరుకుంది. వీటిలో 25,544 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,721 కరోనా మరణాలు సంభవించాయి.

Tags:    

Similar News