Free Condoms: 5 క్లాసు పిల్లలకు కండోమ్సా....దేవుడా?

Free Condoms: అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (సీపీఎస్) బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2021-07-13 04:17 GMT

Free Condoms for Students:(Friensofunfpa)

Free Condoms: 12 ఏళ్ల పిల్లలకు కండోమ్స్ అవసరమా? అవి అందుబాటులో పెట్టాలా? ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అమెరికాలోని చికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. 5వ తరగతి ఆ పై తరగతుల విద్యార్ధులకు పాఠశాలల్లో కండోమ్స్ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఆ వయసు నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమని.. లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భాలను నివారించడానికే ఇదే మార్గమని బోర్డు అభిప్రాయపడింది. ఈ మధ్య కాలంలో స్కూల్ లెవెల్ లోనే డేటింగులు మొదలవటం... అవాంఛిత గర్భాల కేసులు పెరిగాయి. దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

కాని తల్లిదండ్రులు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆలోచన లేనివారికి కూడా ఆలోచన కలిగించినట్లే అవుతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలా చేయకూడదని వారిని ఎడ్యుకేట్ చేయాలి గాని.. అలాగే చేసుకోండన్నట్లు కండోమ్స్ అందుబాటులోకి తేవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే బోర్డు తల్లిదండ్రుల అభ్యంతరాలను స్వీకరిస్తామని ప్రకటించింది.

ఈ నిబంధన ఆ బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించనుంది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు సీపీఎస్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఈ నిర్ణయం పై సీపీఎస్ బోర్డు వైద్యుడు కన్నెత్ ఫాక్స్ సమర్ధిస్తున్నారు. ఆరోగ్య పరమైన నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికైనా ఉందన్నారు. నిర్ణయాలకు తగ్గట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వారికి సరిపడా వనరులు కావాలన్నారు. కండోమ్‌లు కావాలనుకున్నప్పుడు అవి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అనుకుంటున్నామని వెల్లడించారు. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

Tags:    

Similar News