ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత
ఛత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు.
ఛత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు.గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ ఆయన కుమారుడు అమిత్ జోగి ట్వీట్ చేయడం ద్వారా తెలిసింది. ఛత్తీస్ గడ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ జోగి, 2000 నుంచి 2003వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. భోపాల్ మౌలానా ఆజాద్ కాలేజ్ లో
చదివిన జోగి యుపిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కలెక్టర్ అయ్యారు, 1981 నుంచి 1985 మధ్య భోపాల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి.. అనంతరం ఛత్తీస్‌గడ్ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. అజిత్ జోగి మృతిపట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.