ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ వేసే బాధ్యత కేంద్రానిదే : కిషన్‌రెడ్డి

కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే కరోనా కాలంలో టీఆర్‌ఎస్‌ ఏమీ చేసిందో చెప్పాలని, ఈటలను కక్షతో వేధిస్తున్నారని ఆరోపణ

Update: 2021-07-04 15:35 GMT
Central Government Responsibility to Covid Vaccination For Everyone

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)

  • whatsapp icon

Central Minister Kishan Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశప్రజలందరికీ వ్యాక్సిన్ వేసే బాధ్యత కేంద్రానిదే అని తెలిపారు. కరోనా టైంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. రాజకీయ కక్షతోనే ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్‌ వేధిస్తుందని విమర్శించారు. ఈటలను జైల్లో పెట్టినా.. హుజూరాబాద్‌లో గెలిచితీరుతామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా వాటర్‌ వైఫల్యాన్ని టీఆర్ఎస్‌ ప్రభుత్వం కేంద్రంపై మోపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 

Tags:    

Similar News