Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడుపై కేంద్రం కీలక నిర్ణయం
Bengaluru: NIAకు అప్పగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు
Bengaluru: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర నిర్ణయంతో పేలుడు ఘటనపై NIA తాజాగా కేసు నమోదు చేసింది. రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ చోటుచేసుకుంది. ఈ పేలుడులో మొత్తం 10మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు. రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసుకుని ఒక దగ్గర కూర్చుని ... పేలుడుకు ముందు వెళ్లిపోయినట్లు సీసీటీవీ పుటేజీలో రికార్డు అయింది. అతడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లోని టైమర్ సెట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నాు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.