Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం

Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. రోగులను గుర్తించి వారికి వైద్యం అందించేందుకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధంగా ఉంచుతోంది. ఢిల్లీలో మూడు నోడల్ ఆసుపత్రులనుకూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Update: 2024-08-20 01:24 GMT

Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం

Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న మంకీ పాక్స్ పై డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి వారికి వైద్యం అందించేందుకు ఐసోలేషన్ వార్డులను రెడీ చేయాలని అధికారులకు ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మూడు నోడల్ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్ పోర్టులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..అవసరం అయితే అనుమానితులకు ఆర్టీ, పీసీఆర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్రికాలో ఈ సంవత్సరం 18వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. పొరుగుదేశం పాకిస్తాన్ లోనూ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. మంకీపాక్స్ కేసుల్లో మరణాల రేటు 1 నుంచి 10శాతం వరకు ఉంది.

WHO తెలిపిన వివరాల ప్రకారం మంకీపాక్స్ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటకు రావచ్చు. పొక్కులు, జ్వరం, గొంతు ఎండపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి వంటివి సాధారణంగా కనిపిస్తాయి. ఇది దాదాపు రెండు నుంచి 4 వారాలపాటు ఉంటుంది. సదరు వ్యక్తి ఇమ్యూనిటీ పవర్ ఇది ఆధారపడి ఉంటుంది. కొంతమంది నోరు, కళ్లు, గొంతు,ప్రైవేట్ భాగాలపై పొక్కులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఎలా నిర్ధారించాలి

-మంకీపాక్స్ లాగా కనిపించే దద్దర్లు ఉన్న వ్యక్తులను తాగకూడదు.

-మంకీపాక్స్ వైరస్ సోకిన జంతువు లేదా వ్యక్తితో సంబంధం ఉన్న బట్టలు, దుప్పట్లు, ఇతర వస్తువులను ముట్టుకోకూడదు.

-ఎప్పటికప్పుడు సబ్బునీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి.

-చేతులు కడిగేందుకు ఆల్కహాల్ రహిత హ్యాండ్ వాష్ వాడాలి.

-దీని బారినపడకుండా ఉండాలంటే ఈ వ్యాధి లక్షణాలను ముందే తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి.

Tags:    

Similar News