CBSE 12th Exam Results 2020: CBSE పరీక్షల్లో 600 కి 600 మార్కులు..
CBSE 12th Exam Results 2020: శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్న సూక్తిని ఓ 18 ఏళ్ల అమ్మాయి అక్షరాల నిజం చేసింది..
CBSE 12th Exam Results 2020: శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్న సూక్తిని ఓ 18 ఏళ్ల అమ్మాయి అక్షరాల నిజం చేసింది.. తాజాగా విడుదలైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాల్లో వందకి వంద శాతం అంటే 600 కి 600 మార్కులు సాధించి శభాష్ అనిపించింది.. ఇంతకీ ఎవరా అమ్మాయి అని తెలుసుకోవాలని ఉందా అయితే ఇది చదవాల్సిందే..
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన దివ్యాంశి జైన్ (18) అనే అమ్మాయి సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రాసింది.. అయితే ఈ పరీక్షల ఫలితాలు 2020, జులై 13వ తేదీ సోమవారం రోజున విడుదలయ్యాయి. ఇందులో దివ్యాంశి జైన్ కు 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవనే అనాలి.. అయితే ఆర్ట్స్ విభాగంలో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారని విద్యావేత్తలు భావిస్తున్నారు.
ఇంతటి విజయం సాధించడం పట్ల దివ్యాంశి జైన్ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, టీచర్ల మార్గనిర్దేశం వల్లే తాను ఈ ఘనతను సాధించినట్టుగా వెల్లడించింది.. హిస్టరీలో బీఏ సీటు కోసం ఢిల్లీ యూనివర్సిటీకి దరఖాస్తు చేసినట్టుగా తెలిపింది.
ఇక అటు ఈ పరీక్షల ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత 92.15% కాగా, బాలురు 86.19% ఉత్తీర్ణత సాధించారు. ఇక ట్రాన్స్‌జెండర్ల ఉత్తీర్ణత శాతం 66.67గా ఉన్నది. మొత్తంగా పరీక్షల్లో ఉత్తీర్ణత 88.78%గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 5.38% అధికంగా ఉంది. ఇక కరోనా నేపథ్యంలో బోర్డు ఈ ఏడాది మెరిట్ జాబితాను విడుదల చేయలేదు. మొత్తం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు 11.92 లక్షల మంది హాజరయ్యారు.