ఢిల్లీ డిప్యూటీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు.. మంచిపనికి రివార్డ్‌ ఇది: కేజ్రీవాల్‌

CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

Update: 2022-08-19 08:42 GMT

ఢిల్లీ డిప్యూటీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు.. మంచిపనికి రివార్డ్‌ ఇది: కేజ్రీవాల్‌

CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల కేసులో ఈ తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలోని సుమారు 20 ప్రదేశాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. సీబీఐ అధికారులు తన ఇంటికి వచ్చినట్లు మనీష్ సిసోడియా ఇవాళ తన ట్విట్టర్ లో తెలిపారు. దర్యాప్తు సంస్థకు సహకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే వారికి తన వద్ద ఏమీ దొరకదని కూడా సిసోడియా వెల్లడించారు. దేశం కోసం మంచి పనులను చేసేవాళ్లను వేధించడం దురదృష్టకరమని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. విద్యా రంగంలో తాను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరన్నారు. నిజం నిలకడగా తెలుస్తుందని సిసోడియా ట్వీట్ చేశారు.

సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు. తాము చేస్తోన్న మంచి పనులకు కేంద్రం ఇస్తోన్న బహుమానం ఇదేనంటూ దుయ్యబట్టారు. ''ఈరోజే దిల్లీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ను అభినందిస్తూ అమెరికా దిగ్గజ వార్తాపత్రిక అయిన న్యూయార్క్‌ టైమ్స్‌లో మొదటిపేజీలో కథనం వచ్చింది. మనీష్ సిసోడియా ఫొటోను కూడా ప్రచురించారు. ఇదే రోజు ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. మంచి పనికి లభించిన ఫలితమిది. అయితే మేం సీబీఐకి స్వాగతం పలుకుతున్నాం. దర్యాప్తునకు సహకరిస్తాం. గతంలోనూ మా నేతలపై దాడులు జరిగాయి. అప్పుడు వారికి ఏం దొరకలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది'' అని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News