యెస్ బ్యాంకు పునర్ నిర్మాణం కోసం ప్రణాళికను తయారు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ఆమె ఆర్బీఐ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం దివాళా తీసిన యెస్ బ్యాంకుకు బెయిల్ అవుట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
యెస్ బ్యాంకులో సుమారు 49 శాతం ఈక్విటీని పెట్టుబడి పెట్టనున్నట్లు వివరించారు. బ్యాంకు మూలధనాన్ని 11 వందల కోట్ల నుంచి 62 వందల కోట్ల వరకు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. యెస్ బ్యాంకుపై ఉన్న మారిటోరియంను మరో మూడు రోజుల్లో ఎత్తివేయనున్నట్లు తెలిపారు. ఎస్‌బీఐకి చెందిన ఇద్దరు డైరక్టర్లతో ఓ కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.