నేటి నుంచి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆహ్వానం మేరకు వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది
నేటి నుంచి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రష్యా వేదికగా 12వ బ్రిక్స్ దేశాల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆహ్వానం మేరకు వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది 'గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్' అనే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, సౌతాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది 13వ బ్రిక్స్ దేశాల సదస్సు భారత్ నిర్వహించనుంది. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, సౌతాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా పాల్గొననున్నారు.