Anurag Thakur: లిక్కర్ స్కాంలో సిసోడియా నిందితుడు మాత్రమే.. అసలైన సూత్రధారి కేజ్రీవాలే..

Anurag Thakur: ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీ పూర్తిగా కుంభకోణంతో కూడుకుని ఉందని, అయితే ఇందులో పెద్ద హస్తం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‭దేనని కేంద్ర మంత్రి ఠాకూర్ ఆరోపించారు.

Update: 2022-08-20 12:27 GMT

Anurag Thakur: లిక్కర్ స్కాంలో సిసోడియా నిందితుడు మాత్రమే.. అసలైన సూత్రధారి కేజ్రీవాలే..

Anurag Thakur: ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీ పూర్తిగా కుంభకోణంతో కూడుకుని ఉందని, అయితే ఇందులో పెద్ద హస్తం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‭దేనని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ ఆరోపించారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంలో నంబర్ వన్‌ నిందితుడు మనీశ్‌ సిసోడియా. కానీ ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్' అని ఆరోపించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యలపై ఠాకూర్‌ స్పందిస్తూ.. 'ఆ పార్టీ గతంలోనూ ప్రగల్భాలు పలికింది. కానీ ప్రధాని మోడీ ముందు నిలబడలేకపోయింది' అని ఎద్దేవా చేశారు. ఇక తాను ఎలాంటి అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని, కేజ్రీవాల్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు త‌న‌ను ఎక్సైజ్ పాల‌సీ కేసులో ఇరికించార‌ని మ‌నీష్ సిసోడియా కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. విద్య, వైద్యరంగాల్లో కేజ్రీవాల్‌ కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నందునే ఆయన్ను నిలువరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని పూర్తి పారదర్శకతతో అమలు చేశామని పేర్కొన్నారు.

Tags:    

Similar News