Ration Card: రేషన్‌కార్డుదారులకి అలర్ట్‌.. ఈ పనులు జరగాలంటే అవసరమే..!

Ration Card: రేషన్‌కార్డుదారులకి అలర్ట్‌.. ఈ పనులు జరగాలంటే అవసరమే..!

Update: 2022-09-14 06:30 GMT

Ration Card: రేషన్‌కార్డుదారులకి అలర్ట్‌.. ఈ పనులు జరగాలంటే అవసరమే..!

Ration Card: మీరు రేషన్ కార్డును ఉపయోగిస్తే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రేషన్‌కార్డులు పొందిన వారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ కార్డు కింద సాధారణ ప్రజలకు ఉచిత రేషన్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలతో పాటు అనేక పనులు జరుగుతాయి. రేషన్ కార్డుని చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చు. ఇది గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ఇది బ్యాంకుకు సంబంధించిన పని అయినా లేదా గ్యాస్ కనెక్షన్ పొందడానికి ఉపయోగించవచ్చు. ఓటరు గుర్తింపు కార్డును తయారు చేయడమే కాకుండా అవసరమైన ఇతర పత్రాలను తయారు చేయడానికి వినియోగించవచ్చు.

మీ ఆదాయం 27 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే మీరు దారిద్య్రరేఖ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చే అర్హత ప్రకారం దారిద్య్రరేఖకు ఎగువన (APL), దారిద్య్రరేఖకు దిగువన (BPL) కార్డు, అంత్యోదయ రేషన్ కార్డు (AAY) కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు రేషన్‌కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . కొద్ది రోజుల తర్వాత రేషన్ కార్డు మీకు చేరుతుంది.

ఏ పత్రాలు అవసరం?

రేషన్ కార్డు కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్ పోర్టు, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఐడీ ప్రూఫ్ గా ఇవ్వవచ్చు. ఇది కాకుండా చిరునామా రుజువుగా పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యుత్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బుక్, టెలిఫోన్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్, అద్దె ఒప్పందం వంటి పత్రాలు కూడా అవసరమవుతాయి.

Tags:    

Similar News