AIIMS Rishikesh: హెల్త్‌కేర్ డెలివరీలో విప్లవాత్మక మార్పు.. డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ..!
AIIMS Rishikesh: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది.
AIIMS Rishikesh: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా డ్రోన్లు ప్రస్తుతం మన ఎన్నో అవసరాలను తీర్చుతున్నాయి. వ్యవసాయ రంగం నుంచి వైద్య రంగం వరకూ దాదాపు ప్రతి అవసరానికి డ్రోన్లు ముందంజలో ఉన్నాయి. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి డ్రోన్ల ద్వారా మందులను పంపుతున్నారు. ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు, తక్కువ సమయంలోనే మందులు తీసుకొచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
డ్రోన్లద్వారా మందులు పంపిణీ చేయడంలో ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్ రిషికేశ్ విజయవంతమైంది. రిషికేశ్‌లోని ఎయిమ్స్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెహ్రీ గర్వాల్ జిల్లాలోని ఓ ఆసుపత్రికి డ్రోన్ సాయంతో మందులు పంపిణీ చేశారు. క్షయవ్యాధిని నిరోధించే మందులను డ్రోన్ ద్వారా ప్రయోగాత్మకంగా పంపి సక్సెస్ అయ్యారు. డ్రోన్ల వినియోగం హెల్త్‌కేర్ డెలివరీలో విప్లవాత్మక మార్పేనంటున్నారు ఎయిమ్స్ ప్రతినిధులు. ఇకమీదట డ్రోన్ల సాయంతో ఆర్గాన్స్‌కు సరఫరా చేయొచ్చన్నారు.