Corona virus: మళ్లీ పంజా విసురుతున్న కరోనా మహమ్మారి
Coronavirus: వారం రోజుల వ్యవధిలో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెరిగిన కేసులు
Coronavirus: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రతో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కోవిడ్ నియంత్రణకు కఠిన ఆంక్షలు విధించారు. మహారాష్ట్రలో అమరావతి, ముంబై, పూణే, నాగ్‌పూర్, నాసిక్, ఔరంగాబాద్, థానే, నవీ ముంబై, కళ్యాణ్- డోంబివ్లి, యవట్మాల్, వసీం, బుల్దానా ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు విధించారు.
రాజస్థాన్‌లో కోవిడ్ నియంత్రణ కోసం జోధ్‌పూర్‌లో 144 సెక్షన్ ఆంక్షలు అమలు చేశారు. ప్రజలకు మాస్క్‌లు, భౌతికదూరం పాటించాలని సూచించారు. రాజస్థాన్ రాష్ట్రమంతటా వివాహాలు, సభలు, సమావేశాలపై పరిమితులు విధించారు 100 మందికి మించి అతిథులు ఉండరాదని ఆంక్షలు విధించారు. మరోవైపు కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి నెగిటివ్ ఉంటనే కర్ణాటకలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది.. ప్రజా రవాణా వ్యవస్థలో పరిమితులను డీడీఎంఏ విధించింది. రెండు వారాల పాటు బస్సులు, మెట్రోలో ఆంక్షలు విధించారు.