Aadhaar: ఆధార్ కార్డు పోయిందా.. పర్వాలేదు రూ.50 చెల్లించి కొత్తది తీసుకోండి..

Aadhaar: ఆధార్ కార్డు పోయిందా.. పర్వాలేదు రూ.50 చెల్లించి కొత్తది తీసుకోండి..

Update: 2022-04-15 15:30 GMT

Aadhaar: ఆధార్ కార్డు పోయిందా.. పర్వాలేదు రూ.50 చెల్లించి కొత్తది తీసుకోండి..

Aadhaar: గత కొన్నేళ్లుగా ఆధార్ కార్డు వినియోగం చాలా వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ అవసరం. ప్రభుత్వం 2009లో తొలిసారిగా ఆధార్ కార్డును జారీ చేసింది. అప్పటి నుంచి దాని వినియోగం ప్రజల జీవితాల్లో నిరంతరం పెరిగింది. స్కూల్ అడ్మిషన్ నుంచి కాలేజీ అడ్మిషన్ వరకు, హాస్పిటల్‌లో వైద్యానికి, ఆస్తులు కొనడానికి, బ్యాంకు ఖాతా తెరవడానికి, ప్రయాణం చేయడానికి ఇలా ప్రతి చోటా ఆధార్ కార్డునే ఐడీ ప్రూఫ్‌గా వాడుతున్నారు.

ఈ పరిస్థితిలో ఏదైనా కారణం వల్ల ఆధార్ కార్డ్ పోయినట్లయితే అది పెద్ద ఇబ్బందికి కారణం అవుతుంది. దీని వల్ల మీ చాలా పనులు ఆగిపోవచ్చు. అయితే ఆధార్ కార్డు పోయినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం రూ.50 చెల్లించి ఇంట్లోనే కొత్త PVC ఆధార్ కార్డును సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆన్‌లైన్‌లో PVC ఆధార్ కార్డ్‌ని ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకుందాం.

PVC ఆధార్ కార్డ్‌ని ఎలా ఆర్డర్ చేయాలి

1. PVC ఆధార్ కార్డ్‌ని ఆర్డర్ చేయడానికి మీరు ఆధార్ జారీ చేసే సంస్థ UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ని క్లిక్ చేయాలి.

2. ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేస్తే మీకు PVC ఆధార్ కార్డ్ ఎంపిక కనిపిస్తుంది.

3. ఈ ఎంపికపై క్లిక్ చేయండి.

4. ఇక్కడ మీరు ప్రత్యేకమైన 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

5. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి.

6. తర్వాత మీరు ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

7. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని నమోదు చేయండి.

8. దీని తర్వాత అన్ని వివరాలను తనిఖీ చేసిన తర్వాత తదుపరి చెల్లింపు ఎంపికను ఎంచుకోండి.

9. ఆన్‌లైన్ చెల్లింపు చేసిన తర్వాత మీకు స్లిప్ వస్తుంది.

10. తర్వాత PVC ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డ్‌లో నమోదు చేసిన చిరునామాకు 2 నుంచి 3 రోజుల్లో చేరుతుంది.

11. PVC ఆధార్ కార్డ్‌ సరిగ్గా క్రెడిట్ కార్డ్ లాంటిది. ఇది నీళ్లలో తడవదు. దీంతో పాటు పగిలిపోతుందనే భయం ఉండదు. 

Tags:    

Similar News