ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే ఆధార్ లేదా పాస్ పోర్టు కంపల్సరీ !

IRCTC Ticket Booking: ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ లేదా పాస్‌పోర్ట్ కంపల్సరీ అంటోంది భారతీయ రైల్వే

Update: 2021-06-26 04:21 GMT

IRCTC Ticket Booking:(Photo IRCTC) 

IRCTC Ticket Booking: ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ లేదా పాస్‌పోర్ట్ కంపల్సరీ అని ఇండియన్ రైల్వే భావిస్తోంది. ఆన్‌లైన్‌ టికెట్ల రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. బ్లాక్ టికెట్లను నిరోధించడంతోపాటు ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కృషి చేస్తున్నట్లు తెలిపింది.

అలాగే వెబ్‌సైట్‌లోనూ భారీగా మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. ఇకనుంచి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ తో కాకుండా కేవలం ఆధార్ నంబర్‌ లేదా పాస్‌పోర్ట్‌ నంబర్‌తో లాగిన్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల టికెట్ బుకింగ్‌ల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ పేర్కొంది. అందుకే ఆధార్, పాస్‌పోర్ట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

"టికెట్ బుకింగ్ కోసం లాగిన్ కావాలంటే ఇకనుంచి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు వంటి పత్రాలు తప్పనిసరి చేసేందుకు ఐఆర్‌సీటీసీతో కలిసి మేము పని చేస్తున్నాం. ఆధార్ కార్డును చేర్చే ప్రక్రియ చివరి దశలో ఉందని" రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ అరుణ్ కుమార్ అన్నారు. "ట్రైన్‌ టిక్కెట్లు వేగంగా బుక్‌ చేసేందుకు ఏజెంట్లు ఇతర సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో సాధారణ ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవాలంటే చాలా సమయం(కనీసం 10 నుంచి 15 నిమిషాలు) పడుతుందని కొన్ని సోర్సులు వెల్లడిస్తున్నాయి.

Tags:    

Similar News