Wayanad: వయనాడ్‌ విషాదానికి వారం రోజులు... తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

Wayanad: ఇప్పటివరకు 300కు పైగా మృతదేహాల గుర్తింపు

Update: 2024-08-05 11:04 GMT

Wayanad: వయనాడ్‌ విషాదానికి వారం రోజులు... తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

Wayanad:  వయనాడ్‌ విపత్తుకు వారం పూర్తైంది. ఇప్పటికీ ఎక్కడ చూసినా ఆ విపత్తు మిగిల్చిన విషాదఛాయలే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ బురదలో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు గాలింపు కొనసాగుతూనే ఉంది. వందల మంది రెస్క్యూ టీమ్‌ ఇంకా సెర్చ్ ఆపరేషన్‌ చేస్తూనే ఉన్నాయి. టెక్నాలజీ సాయంతో గల్లంతైన వారికోసం వెతుకులాట కొనసాగుతూనే ఉంది.

వయనాడ్ విషాద ఘటనలో తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 3 వందలకు పైగా మృతదేహాలు గుర్తించగా.. ఇంకా 180 మంది ఆచూకీ తెలియడం లేదు. దీంతో వారిని రాడార్ సాయంతో గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సిగ్నల్స్ అందిన ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. మరిన్ని జాగిలాలను రంగంలోకి దించింది డాగ్ స్క్వాడ్.

ఇక హాస్పిటల్స్‌లో ఎక్కడ చూసినా మృతుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాలతో అక్కడి దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. ఇప్పటివరకు పలు మృతదేహాలు అప్పగించగా.. గుర్తించలేని స్థితిలో 31 మంది మృతదేహాలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఇవాళ పరీక్షలు చేసి వారిని నిర్ధారించనున్నారు. వయనాడ్‌ ప్రాంతంలో ఇళ్లు కొట్టుకుపోవడంతో వేల మంది నిరాశ్రయులయ్యారు. చురల్‌మలలో 2 వేలు, ముండక్కైలో 12 వందలు, అట్టమలలో 14 వందల మంది జీవనంపై వరద ఎఫెక్ట్ పడింది. ఇప్పటివరకు రక్షించిన వారిని 53 క్యాంపులు ఏర్పాటు చేసి తరలించరు. ప్రస్తుతం 6 వేల 7 వందల మంది నిరాశ్రయులు క్యాంపుల్లో ఉన్నారు.

Tags:    

Similar News