Delhi: కాలుష్యం గుప్పిట్లో యమునా నది
* యమునా నదిలో స్నానం చేస్తే మృత్యువు ఖాయంగా అనిపిస్తోంది
Polluted Yamuna: యమునా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ప్రజల విశ్వాసం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే..ఇందులో స్నానం చేస్తే మృత్యువు ఖాయంగా అనిపిస్తోంది. ఎందుకంటే కాలుష్యం వల్ల యమునా నదీ నీరు మొత్తం విషతుల్యంగా మారింది. ఫ్యాక్టరీలు, గృహ సముదాయాల నుంచి వచ్చే వ్యర్థాలతో నదీ జలం మొత్తం కలుషితంగా మారి.. తెల్లని నురగ రూపంలో ప్రవహిస్తోంది.
యమునా నది చుట్టుపక్కల పల్లెల్లో భూగర్భ జాలు విషతుల్యమవుతున్నాయని, ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారని ప్రజలు అంటున్నారు. దీంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నదిని శుభ్రం చేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది. నురుగు తొలగించేందుకు జల్ మండలి ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసింది. కలింది కుంజ్ ప్రాంతంలో బోట్లతో నురుగును తొలగిస్తున్నారు.