Supreme Court: సుప్రీంకోర్టులో యూపీ సర్కార్‌కు షాక్
Supreme Court: నేమ్ ప్లేట్ పెట్టాలనే యూపీ నిర్ణయంపై సుప్రీం స్టే
Supreme Court: కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల యజమానులు బయట తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. షాపు యజమానులు తమ షాపుల ముందు తమ పేరు లేదా గుర్తింపును చూపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. తయారు చేస్తున్న ఆహారాన్ని మాత్రమే ప్రదర్శించాలని దుకాణదారులను ఆదేశించింది. ప్రభుత్వాల ఆదేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.