Doctor Murder Case: సంచలన నిర్ణయం.. రేపు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్..!

Doctor Murder Case: కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో రెసిడెంట్ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యింది. దీంతో సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్ తెలిపింది.

Update: 2024-08-11 15:27 GMT

Doctor Murder Case

Doctor Murder Case: వెస్ట్ బెంగాల్‌లో వైద్యురాలి దారుణ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో రెసిడెంట్ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యింది. బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో ఇప్పటికే వెల్లడైంది. ఈ కేసులో సంజయ్‌ రాయ్‌ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడు పోలీసులకు అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే జూనియర్ డాక్టర్ దారుణ హత్యపై రెసిడెంట్‌ డాక్టర్లు తీవ్రంగా స్పందించారు.

సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖను పంపించింది. ఆర్​జీ కార్‌ మెడికల్‌ కళాశాల వైద్యులకు మద్దతుగా ఈ చర్యను చేపట్టినట్లు ప్రకటించింది. దౌర్జన్యాలకు గురైన తమ వారికి న్యాయం జరగాలని పేర్కొంది. ఈ విషయానికి రాజకీయ రంగు పులిమి ప్రతికూల కోణంలో చూడొద్దని అభ్యర్థించింది. అన్ని వర్గాలు వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది.

Tags:    

Similar News