భారత్‌లో కొత్త‌గా 82,170 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-09-28 05:05 GMT

India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 60 లక్షల 74 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 82,170 కేసులు నమోదు కాగా, 1039 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 74,893 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 60,74,703 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,62,640 ఉండగా, 50,16,520 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 95, 542 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 82.58 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.57 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 15.85 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 7,09,394 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 7,19,67,230 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News