Farmers Protest: ఢిల్లీలో రైతుల ఉద్యమానికి 8నెలలు పూర్తి
Farmers Protest: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల ఆందోళన * గతేడాది నవంబర్ 26నుంచి నిరసనలు
Farmers Protest: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమానికి నేటితో 8 నెలలు పూర్తి అయ్యాయి. గతేడాది నవంబంర్ 26 నుంచి రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 240 రోజులుగా సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్ పూర్, పల్వర్ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తు్న్నారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు ఇవాళ జంతర్ మంతర్ వద్ద మహిళా రైతులు కిసాన్ సంసద్ నిర్వహించారు.