భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం .. గ‌త 24 గంట‌ల్లో 7,964 కేసులు..

Update: 2020-05-30 05:08 GMT

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 7,964 కేసులు నమోదు కాగా, 265 మంది ప్రాణాలు విడిచారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఒకే రోజు అత్య‌ధిక స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ఇదే అత్య‌ధికం. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,763గా ఉన్న‌ది. మృతుల సంఖ్య 4,971కి చేరింది. ఇక 82,369 మంది కోలుకొని ఇళ్లకు చేరగా.. మరో 86,422 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 11,264 మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. 


Tags:    

Similar News