మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా కలకలం.. ఇద్దరు మంత్రులతో సహా 50 మందికి పాజిటివ్

Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

Update: 2021-12-29 09:33 GMT

మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా కలకలం.. ఇద్దరు మంత్రులతో సహా 50 మందికి పాజిటివ్ 

Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కూడా కరోనా విరుచుకుపడుతోంది. డిసెంబర్ 22న ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. అయితే ఐదు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 50 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని తెలిపారు. మంత్రులు వర్ష గైక్వాడ్‌, కేసీ పాడ్వి వైరస్ బారిన పడ్డారు.

వీరితో పాటు శాసనసభలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పలువురు పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు కూడా నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మంగళవారం 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 167 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన మహా సర్కారు.. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది.

Tags:    

Similar News