గుజరాత్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. రాజ్‌కోట్ నుంచి 83 కిలోమీటర్ల దూరంలో సోమవారం తెల్లవారుజామున 12.57 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతను నమోదు చేసింది. 24 గంటల్లోపు సంభవించిన రెండవ భూకంపం ఇది. దీనిపై జాతీయ భూకంప కేంద్రం సమాచారం ఇచ్చింది. ఆదివారం రాత్రి 8:13 గంటలకు భూకంపం యొక్క బలమైన ప్రకంపనలు వచ్చాయని. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.5గా ఉందని తెలిపింది. అయితే దీని కేంద్రం కచ్ లోని వొంద్ గ్రామంలో ఉందని పేర్కొంది.
కాగా 19 సంవత్సరాల క్రితం, అంటే 26 జనవరి 2001 న, కచ్ లోని భుజ్ లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోవైపు భూ ప్రకంపనలపై ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కచ్, రాజ్‌కోట్, పటాన్ జిల్లా కలెక్టర్లతో, భూకంపం సంభవించిన ప్రాంతాలు, ప్రకంపనలు సంభవించిన ప్రాంతాల పరిస్థితిపై టెలిఫోన్ సంభాషణలు జరిపారు. నష్టాన్ని నివేదించాలని.. అవసరమైతే విపత్తు నిర్వహణ దళాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది.