PSB Banks on Strike: ఆ 4 రోజులు బ్యాంకులు బంద్!
PSB Banks on Strike: బ్యాంకుల్లో పని ఉంటే ఈ వారమే త్వరగా చూసుకోండి. ఎందుకంటే ఈ నెలలో వరుసగా 4 రోజులు బ్యాంకులు పనిచేయవు.
PSB Banks on Strike: బ్యాంకుల్లో పని ఉంటే ఈ వారమే త్వరగా చూసుకోండి. ఎందుకంటే..ఈ నెలలో వరుసగా 4 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఈ విషయాన్ని గమనించి ఆర్థిక అవసరాల విషయంలో జాగ్రత్త పడటం మంచిది. ఏటీఎం లుకూడా పనిచేయకపోతే నగదుకు చాలా కష్టం ఏర్పడుతుంది. కాబట్టి వీలైతే ముందుగానే అవసరాలను గుర్తించి నగదు దగ్గర ఉంచుకోవడం మంచిది.
అసలు విషయం ఏంటంటే.. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత నాలుగు సంవత్సరాలలో మొత్తం 14 బ్యాంకులను ప్రైవేటీకరణ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ మార్చి 15, 16వ తేదీల్లో బ్యాంకు ఉద్యోగ సంఘాలు (The United Forum of Bank Unions) (UFBU) సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఆ రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇక మార్చి 13న రెండో శనివారం, 14న ఆదివారం బ్యాంకులకు హాలీడేస్. దీంతో మార్చి 13 నుంచి మార్చి 16వరకు బ్యాంకులు మూతపడనున్నాయి.
అయితే ఇంటర్నెట్, మొబైల్ బ్యాకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. వాటి ద్వారా బ్యాంకు ఖాతాదారులు తమ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. బ్యాంకుల్లో పనులుంటేనే ఈలోపే చూసుకోండి.