Corona Cases in India: కొత్తగా 38,079 మందికి పాజిటివ్

Corona Cases in India: కరోనాతో మరో 560 మంది మృతి * 97.31 శాతానికి పెరిగిన రికవరీ రేటు

Update: 2021-07-17 06:35 GMT

Representational Image

Corona Cases in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 19 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహిచగా.. వారిలో 38 వేల 79 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. కరోనాతో మరో 560 మంది బాధితులు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4 లక్షల 13 వేల 91కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మూడో వేవ్ ప్రారంభదశలో ఉందని ఇదివరకే డబ్యూహెచ్ వో హెచ్చరించింది. ఈ క్రమంలో రానున్న వంద రోజులు అత్యంత కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనల విషయంలో ఏమాత్రం అలసత్వం వద్దని హెచ్చరించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4 లక్షల 24 వేల 25 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా రికవరీ రేటు 97.31 శాతానికి పెరిగింది. 24గంటల్లో 43వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

Tags:    

Similar News