Jayalalitha: 6 ట్రంకు పెట్టెలతో రండి.. జయలలిత బంగారు ఆభరణాలు తీసుకెళ్లండి.. తమిళ ప్రభుత్వానికి కోర్టు ఆదేశం..!

Tamil Nadu: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)కు సంబంధించిన వ్యవహారంలో కర్ణాటకలోని బెంగళూరు కోర్లు కీలక తీర్పు వెల్లడించింది.

Update: 2024-02-20 11:46 GMT

Jayalalitha: 6 ట్రంకు పెట్టెలతో రండి.. జయలలిత బంగారు ఆభరణాలు తీసుకెళ్లండి.. తమిళ ప్రభుత్వానికి కోర్టు ఆదేశం..!

Tamil Nadu: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)కు సంబంధించిన వ్యవహారంలో కర్ణాటకలోని బెంగళూరు కోర్లు కీలక తీర్పు వెల్లడించింది. జయలలితకు చెందిన 27 కిలోల బంగారు, వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6, 7 తేదీల్లో ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అందజేస్తున్నట్లు బెంగళూరు 36వ సిటీ సివిల్ కోర్టు సోమవారం ప్రకటించింది. కాగా, ఈ రెండు రోజుల్లో నగలను తీసుకెళ్లేందుకు 6 ట్రంకు పెట్టెలతో రావాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. జయలలితకు చెందిన మొత్తం 27 కేజీల బంగారు, వజ్రా భరణాలతో పాటు, 700 కేజీలకుపైనే వెండిని ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు ప్రకటించింది.

కాగా, అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలి, నాలుగేళ్ల జైలుశిక్ష పడిన దాదాపు 10 ఏళ్ల తర్వాత, అలాగే, ఆమె మరణించిన ఏడేళ్ల తర్వాత ఇలాంటి తీర్పు వచ్చింది.

జయలలితకు చెందిన చర, స్థిరాస్తుల వేలానికి సంబంధించి ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణ జరగుతోంది. ఈ ఆభరణాలను వేలం వేసిన తర్వాత, కోర్టు ఆమె స్థిరాస్తిని వేలానికి తీసుకువస్తుంది. 20 కిలోల ఆభరణాలను విక్రయించడం లేదా వేలం వేయడం ద్వారా జరిమానాను తిరిగి వసూలు చేయనున్నారు. అయితే, 7 కిలోల ఆభరణాలు ఆమె తల్లి నుంచి వారసత్వంగా పరిగణిస్తున్నందును.. వాటికి మినహాయింపు ఉంటుంది. జయలలిత ఖాతా ఉన్న కాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సోమవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు సుమారు రూ.60 లక్షలను అందజేసింది.

పరిహారంగా బంగారు, వజ్రాభరణాలు..

ప్రత్యేక న్యాయమూర్తి మోహన్ తన మునుపటి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 16న తమిళనాడు ప్రభుత్వం జీవోను జారీ చేసిందని, అందులో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డివిఎసి) పోలీసు అధికారి క్లుప్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరు కోర్టుకు వచ్చి బంగారు, వజ్రాభరణాలను స్వీకరించడానికి ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు అధికారం ఇచ్చింది.

జయలలితకు 100 కోట్ల జరిమానా..

సెప్టెంబరు 2014లో, ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి'కున్హా 1,136 పేజీల తీర్పులో జయలలిత, ఎన్ శశికళ, జె ఇళవరసి, విఎన్ సుధాకరన్‌లను దోషులుగా నిర్ధారించి, వారందరికీ నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. జయలలితకు రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురికి రూ.10 కోట్ల చొప్పున జరిమానా విధించారు. మే 11, 2015న కర్ణాటక హైకోర్టు వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసినప్పటికీ, ఫిబ్రవరి 14, 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి'కున్హా ఉత్తర్వులను పునరుద్ధరించింది. అప్పటికి జయలలిత మరణించినందున, వారిపై అభియోగాలను ఉపసంహరించుకుంటామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అయితే మిగిలిన ముగ్గురికి నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.

Tags:    

Similar News