Coronavirus: భారత్‌లో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు
Coronavirus: వారం రోజులుగా మూడులక్షలలోపే పాజిటివ్ కేసులు * దేశంలో కొత్తగా 2లక్షల 40వేల 842 కరోనా కేసులు
Coronavirus: భారత్‌లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా మూడులక్షలలోపే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 2లక్షల 40వేల 842 పాజిటివ్ కేసులు రికార్డవగా.. 24 గంటల్లో 3వేల 741మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక ఒక్కరోజులో వివిధ ఆసుపత్రుల నుంచి 3లక్షల 55వేల 102మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 28లక్షల 5వేల 399యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2కోట్ల 65లక్షల 30వేల 132 కరోనా కేసులు నమోదవగా 2కోట్ల 34లక్షల 25వేల 467మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2లక్షల 99వేల 266 మంది కోవిడ్ బారిన పడి మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 87.76శాతం రికవరీ రేటు ఉండగా, మరణాల రేటు 1.12శాతంగా ఉంది. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 16లక్షల 4వేల 542 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.