Chardham Yatra 2022: చార్ ధామ్ యాత్రలో 203 మంది మృతి
Chardham Yatra 2022: పవ్రితమైన నాలుగు క్షేత్రాలను దర్శించుకోవాలని చార్ ధామ్ వెళ్తున్న యాత్రికులు మృత్యువాత పడుతున్నారు.
Chardham Yatra 2022: పవ్రితమైన నాలుగు క్షేత్రాలను దర్శించుకోవాలని చార్ ధామ్ వెళ్తున్న యాత్రికులు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 203 మంది యాత్రికులు మృతి చెందారు. కేదార్‌నాథ్ మార్గంలో 97 మంది, బద్రీనాథ్ మార్గంలో 51 మంది, గంగోత్రి మార్గంలో 13 మంది, యమునోత్రి మార్గంలో 42 మంది మృతి చెందారు. మే 3న ప్రారంభమైన ఈ యాత్రలో రెండు నెలలు గడువకముందే 200 మంది మృతి చెందడం విషాదానికి గురి చేస్తోంది.
ప్రతికూల వాతావరణం, గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలతోనే ఎక్కుమంది చనిపోయినట్టు ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. మే 3 నుంచి ఇప్పటివరకు 25 లక్షల మంది యాత్రికులు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. వాతావరణంలో మార్పులు, వర్షాల కారణంగా వారం రోజులుగా యాత్రికుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యాత్రికులు తప్పనిసరిగా చార్‌థామ్ యాత్రకు ముందే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోరుతోంది.