Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి

Ayodhya Ram Mandir: ప్రత్యేక వాహనంలో అగర్‌బత్తి అయోధ్యకు తరలింపు

Update: 2024-01-16 12:01 GMT

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి

Ayodhya Ram Mandir: అయోధ్యలో అతి భారీ అగర్‌బత్తిని వెలిగించారు ఆలయ నిర్వాహకులు. రామయ్య పాదాల చెంత 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పుతో తయారైన భారీ అగర్‌బత్తి వెలిగింది. ఈ అగర్‌బత్తిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌దాస్ జీ మహారాజ్ ముట్టించారు. పలువురు ఆలయ పెద్దలు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుజరాత్‌ వడోదరలోని తర్సాలీ గ్రామస్తులు ఈ భారీ అగర్‌బత్తిని తయారు చేశారు.

రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గ్రామస్తులు 108 అడుగుల అగర్‌‌బత్తీ తయారీలో పాలు పంచుకున్నారు. ఈ భారీ అగర్‌బత్తి కారణంగా రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్థుల అభిప్రాయం. అగర్‌ బత్తీ తయారీకి విహాభాయ్ అనే రైతు పూనుకోవడంతో గ్రామస్తులంతా సహకరించారు. అగర్‌బత్తి తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవుపేడ తదితర వాటిని ఉపయోగించారు. ఈ అగర్‌బత్తి మొత్తం బరువు 3,400 కిలోలు. ప్రత్యేక వాహనంలో అగర్‌బత్తిని అయోధ్యకు తరలించారు.

Tags:    

Similar News