ఇప్పటికైనా సంతోష్ పద్ధతి మారుస్తాడా?

* సంతోష్ శోభన్ స్టోరీ సెలక్షన్ మారాలి అంటున్న అభిమానులు..

Update: 2023-01-17 16:00 GMT

ఇప్పటికైనా సంతోష్ పద్ధతి మారుస్తాడా?

Santosh Sobhan: "ఏక్ మినీ కథ" సినిమాతో మంచి పేరు సంపాదించిన యువ హీరో సంతోష్ శోభన్ ఈమధ్యనే "కళ్యాణం కమనీయం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ కుమార్ ఆళ్ళ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా పెద్దపెద్ద సినిమాలకు పోటీగా విడుదలైన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకున్న సంతోష్ శోభన్ ఆశలన్నీ అడియాసలైపోయాయి.

గత కొంతకాలంగా సంతోష్ ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసింది. "ఏక్ మినీ కథ" పర్వాలేదు అనిపించినప్పటికీ అది థియేటర్లలో విడుదల కాలేదు. "మంచి రోజులు వచ్చాయి", "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయాయి. ఈసారైనా సంతోష్ శోభన్ తన రొటీన్ కథలను మార్చి కొన్ని ఆసక్తికరమైన సినిమా లతో ప్రేక్షకుల ముందుకి వస్తాడేమో అని అందరు అనుకున్నారు. "కళ్యాణం కమనీయం" చిత్ర ట్రైలర్ విడుదలైనప్పటినుంచి బాలీవుడ్ సినిమా "కి అండ్ కా" మరియు "7/g బృందావన్ కాలనీ" వంటి సినిమాలను గుర్తు చేసింది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఎంత తక్కువ రన్ టైంతో వచ్చిన సినిమా అయినప్పటికీ చాలా ఎక్కువ సేపు ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి కారణం స్లో నేరేషన్ మరియు రొటీన్ కథ. ఇంకా సంతోష్ చేతిలో ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కథలను సెలెక్ట్ చేసే విధానం మార్చే వరకు సంతోష్ మంచి హిట్ అందుకునే అవకాశం లేదనే చెప్పకపోవచ్చు. మరి ఇప్పటికైనా సంతోష్ మారతాడా లేదా అని చూడాలి.

Tags:    

Similar News