ధియేటర్లు రీఓపెన్.. ముందుగా రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటి?
Theaters Reopen : కరోనా వలన నష్టపోయిన రంగాలలో సినిమా రంగం కూడా ఒకటి... షూటింగ్ లు ఆగిపోయాయి... ధియేటర్లు మూతపడ్డాయి... దీనితో ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టపోయింది..
Theaters Reopen : కరోనా వలన నష్టపోయిన రంగాలలో సినిమా రంగం కూడా ఒకటి... షూటింగ్ లు ఆగిపోయాయి... ధియేటర్లు మూతపడ్డాయి... దీనితో ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టపోయింది.. తాజాగా అన్ లాక్ 5.0లో భాగంగా 50% సిట్టింగ్ సామర్ధ్యంతో అక్టోబర్ 15 నుంచి ధియెటర్లని తెరుచుకునేందుకు ఆదేశాలని ఇచ్చింది కేంద్రప్రభుత్వం.. థియేటర్లు తెరచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు పునః ప్రారంభంపై అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే ధియెటర్లు ఓపెన్ చేస్తున్నారు సరే.. పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 'కరోనా వైరస్' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా ఆఫీషియల్ అనౌన్స్ కూడా ఇచ్చేశాడు. ఇలాగే మరిన్ని చిన్న సినిమాలు రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తాయి.. అయితే పెద్ద సినిమాలు మాత్రం ఇప్పట్లో ధియేటర్లలో రిలీజ్ అయ్యే ఛాన్సులు కనబడడం లేదు.. దసరాకి రామ్ రెడ్, నితిన్ రంగ్ దే లాంటి ఓ మోస్తరు చిత్రాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటికీ కాకపోయినా దీపావళికి అయిన ఈ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకి ఓటీటీనుంచి భారీ ఆఫర్ వచ్చినప్పటికీ ధియేటర్ లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక చిరంజీవి ఆచార్య, రాజమౌళి RRR, యష్ KGF 2 లాంటి బడా చిత్రాలను మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ గా రిలీజ్ చేయనున్నారు. 50 % సిట్టింగ్ సామర్ధ్యంతో ధియేటర్లలో ఈ సినిమాలకి రిలీజ్ చేస్తే లాభాలు ఏమో కానీ పెట్టిన పెట్టుబడి రావడం కూడా గగనమే.. అయితే సంక్రాంతికి మాత్రం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రావడం పక్కా అని అంటున్నారు. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో అభిమానులు కూడా ధియేటర్లలలోనే సినిమాని చూడాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.