రాజమౌళి సినిమాకి వినాయక్ డైరెక్షన్!
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమాతోనే హీరోగా ప్రూవ్ చేసుకున్న సాయికి ఆశించిన విజయం మాత్రం దక్కలేదు.
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమాతోనే హీరోగా ప్రూవ్ చేసుకున్న సాయికి ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. అయితే గత ఏడాది మాత్రం రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరవాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు శ్రీనివాస్. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించనున్నారన్న దానిపైన చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరైనా వి.వి వినాయక్ ని ఫైనల్ చేస్తూ చిత్ర బృందం ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. రీమేక్‌లు తెరకెక్కించడంలో వి.వి.వినాయక్ మంచి నేర్పరి కావడంతో వినాయక్ ని ఫైనల్ చేసినట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్బంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఛత్రపతి సినిమా తనకి సరైన ప్రాజెక్ట్ అని నమ్ముతున్నానని తెలిపాడు. ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించడం మరింత ఆనందంగా ఉందని అన్నాడు. ప్రభాస్ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నాని వెల్లడించాడు. పెన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
ఇక అటు అల్లుడు అదుర్స్ సినిమా విషయానికి వచ్చేసరికి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి శ్రీనివాస్ ఏకంగా 8 ప్యాక్స్ లుక్ తో మెప్పించానున్నాడు.. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . డూడ్లే ఈ సినిమాకు సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.