ఫ్లాప్ సినిమాకు థియేటర్‌లు పెంచారట..

మామూలుగా ఏదైనా సినిమాకు మంచి టాక్ లభిస్తే ఆ సినిమాకు థియేటర్లను పెంచటం మామూలు విషయమే. కానీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాకు థియేటర్లను పెంచటం తక్కువగానే జరుగుతుంది.

Update: 2019-01-16 12:41 GMT

మామూలుగా ఏదైనా సినిమాకు మంచి టాక్ లభిస్తే ఆ సినిమాకు థియేటర్లను పెంచటం మామూలు విషయమే. కానీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాకు థియేటర్లను పెంచటం తక్కువగానే జరుగుతుంది. కానీ ఆ అదృష్టం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దక్కింది. 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ మొట్టమొదటిసారిగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించాడు. 'వినయ విధేయ రామ' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పెద్ద కథ అంటూ ఏమీ లేకుండా కేవలం యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేస్తూ కొన్ని నవ్వు తెప్పించే యాక్షన్ సన్నివేశాలను దట్టించి బోయపాటి సినిమాను తీశారు.

కీయార అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా ఓపెనింగ్ రోజున ప్రేక్షకుల నుంచి నెగటివ్ రివ్యూలను అందుకుంది. అయినప్పటికీ సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ఈ సినిమా బాగానే వసూళ్లను రాబడుతోంది. అందుకని మండపేట, అనంతపూర్, ఈస్ట్ గోదావరి మరియు ఉత్తరాంధ్రలోని కొన్ని ఏరియాల్లో కొన్ని థియేటర్ల సంఖ్య ని పెంచినట్లు తెలుస్తోంది. కాబట్టి సినిమా ఫ్లాప్ అయినా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తుందన్నమాట.

Similar News