ఆఫీషియల్ : ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో సేతుపతి
Muthiah Muralidaran Biopic : శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర పైన ఓ బయోపిక్ తెరకెక్కుతున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..
Muthiah Muralidaran Biopic : శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర పైన ఓ బయోపిక్ తెరకెక్కుతున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ చిత్రబృందం వెల్లడించింది. మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నాడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్‌కు '800' అని టైటిల్ పెట్టారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సినిమా కోసం మురళీధరన్ బౌలింగ్‌ను విజయ్ ప్రాక్టీస్ చేయడం కూడా మొదలు పెట్టాడు..
ముత్తయ్య మురళీధరన్ గా విజయ్ మెప్పించడం ఖాయమని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాని అన్ని భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇక విదేశీ క్రికెటర్ పైన బయోపిక్ తెరకెక్కడం అనేది ఇదే తోలిసారి కావడం విశేషం.. ఈ బయోపిక్ కోసం అటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మురళీధరన్ క్రికెట్ విషయానికి వచ్చేసరికి 1972, ఏప్రిల్ 17న శ్రీలంకలోని క్యాండీలో తమిళ హిందూ కుటుంబంలో.. సిన్నసామి ముత్తయ్య, లక్ష్మీ దంపతులకు జన్మించారు మురళీధరన్ .
టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఎనమిది వందల వికెట్లు తీసి ఘనతని సాధించి రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ మురళీధరన్ కావడం విశేషం.. అటు వన్డేలో 534 వికెట్లు తీశాడు. చివరగా మురళీధరన్ 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడి క్రికెట్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.