కడప దర్గాకు రామ్ చరణ్.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఉపాసన
Upasana Konidela: రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదంగా మారింది.
Upasana Konidela: రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో రామ్ చరణ్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. అయ్యప్ప మాలలో ఉండి దర్గాను ఎలా సందర్శిస్తారని మండిపడుతున్నారు. అయితే దీనిపై చరణ్ భార్య ఉపాసన స్పందించారు. చరణ్ దర్గా సందర్శనను తప్పుబడుతున్న వారికి కౌంటర్ ఇచ్చారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది.. అంతే తప్ప భారతీయులుగా విడిపోయేలా చేయదు. మన బలం ఐక్యమత్యంగా ఉండడం. తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందని ఎక్స్ వేదికగా స్పందించారు.
మామూలుగా రామ్ చరణ్ దర్గాకు వెళితే ఇంత చర్చ జరగకపోయేది. కానీ అయ్యప్ప మాలలో ఉండడం వల్ల వివాదంగా మారింది. దీనిపై కొంతమంది నెటిజన్లు, అయ్యప్ప భక్తులు రామ్ చరణ్‌కు సపోర్ట్ చేస్తున్నారు. శబరిమల వెళ్లేటప్పుడు.. అయ్యప్ప భక్తులు ఎరుమేలిలో ఉన్న వావర్ అనే ముస్లిం దర్గాను సందర్శించి వెళ్తుంటారు. ఎరుమేలిలో వావర్ సమాధిని సందర్శించడం తప్పు కాదు అన్నప్పుడు.. చరణ్ కడప దర్గాను సందర్శించడం ఎలా తప్పు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్‌పై విమర్శలు చేస్తున్న వారికి ఉపాసన సమాధానం చెంప పెట్టు అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ ఆమె ట్వీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.