AR Rahaman, Saira Banu: విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన దంపతులు... ముగిసిన 29 ఏళ్ళ అనుబంధం

Update: 2024-11-20 02:38 GMT

AR Rahman: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన మ్యూజిక్ కంపోజింగ్, సింగింగ్ టాలెంట్ తో యావత్ భారతదేశం వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రెహమాన్ బార్య సైరా భాను తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి సైరా భాను రెహమాన్ నుంచి విడిపోతున్నట్లు ధ్రువీకరిస్తూ ప్రతికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా రెహమాన్, సైరాబాను వివాహిక జీవితానికి 29సంవత్సరాలు పూర్తయ్యాయి. సుమారు 3 దశాబ్ద కాలం తర్వాత జంట విడిపోవడం ఇప్పుడు వైరల్ అవుతోంది. 

ఇండియాలోని మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పేరు పరిచయం అవసరం లేదు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో వరల్డ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అందుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ పార్టనర్ గా ఉన్న సైరాబాను చేసిన ప్రకటన ఇప్పుడు మ్యూజిక్ ప్రియులకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. తన భర్త నుంచి విడిపోతున్నట్లుగా రెహమాన్ భార్య సైరాబాను ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ప్రకటనలో తెలిపింది.

పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత శ్రీమతి సైరా తన భార్య ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవడానికి చాలా కష్టమైన నిర్ణం తీసుకుంది. ఈ నిర్ణయం వారి సంబంధంలో చాలా భావోద్వేగ ఒత్తిడి తర్వాత వచ్చింది. వారి ప్రేమ చాలా లోతుగా ఉన్నప్పటికీ ఒకరికొకరికి మింగిలి కాలేకపోతున్నట్లుగా తేల్చారు. ఈ జంట ఉద్రిక్తతలు కష్టాలు తమ మధ్య అధిగమించలేని అంతరాన్ని ఏర్పారిచినట్లు గుర్తించారు. అందుకే తమ మధ్య ఉన్న బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

రెహమాన్ 195లో సైరాను పెళ్లి చేసుకున్నారు. ఈ జంట పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. తన చాట్ షోలో సిమి గరేవాల్ తో చేసిన చాట్ లో రెహమాన్ తన తల్లి తన పెళ్లిని నిర్ణయించినట్లు తెలిపారు. తనకు పెళ్లికూతురును కూడా వెతుక్కోవడానికి సమయం లేదని అందుకే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నానని చెప్పుకొచ్చారు. కాగా ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Tags:    

Similar News