Nayanthara vs Dhanush: నయనతార డాక్యుమెంటరీ రిలీజ్, ధనుష్ వివాదంలో లేటెస్ట్ అప్‌డేట్స్..
Nayanthara vs Dhanush: కోలీవుడ్‌లో ప్రస్తుతం ధనుష్, నయనతార ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.
Nayanthara vs Dhanush: కోలీవుడ్‌లో ప్రస్తుతం ధనుష్, నయనతార ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. నయనతార రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీని ఇవాళే నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ధనుష్ నిర్మాణంలో వచ్చిన నేను రౌడీనే సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో చూపించారు. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార ఒక బార్‌లో కనిపిస్తారు. ఆ క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సినిమాకు హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. తన అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో ఆ వీడియో ఎలా వాడుతారు అంటూ ధనుష్ రూ.10 కోట్లు చెల్లించాల్సిందిగా కాపీ రైట్ యాక్ట్ కింద లీగల్ నోటీసులు పంపించారు.
విష్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం నేను రౌడీనే సినిమా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో విష్నేశ్, నయనతార ప్రేమ మొదలైంది. పెద్దల అంగీకారంతో 2022లో పెళ్లి చేసుకున్నారు. నయన్ కెరీర్, ప్రేమ, పెళ్లిపై నెట్‌ఫ్లిక్స్ " నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ " అనే డాక్యుమెంటరీని రూపొందించింది. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన నేను రౌడీనే వీడియోలు, పాటలను ఇందులో చూపించాలని నయనతార, విష్నేష్ శివన్ భావించారు. కాకపోతే దానికి ధనుష్ నుంచి ఆమోదం లభించలేదు. ఇటీవల డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల కాగా.. అందులో సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల పుటేజ్ వాడుకోవడంపై ధనుష్ లీగల్ నోటీసు పంపించారు.
ధనుష్ లీగల్ నోటీసుకు నయనతార తీవ్రస్థాయిలో మండిపడింది. ధనుష్ అసలు స్వరూపం బయట పడిందని, ఆయన జనాలకు చెప్పేది ఒకటి, తాను వ్యవహరించేది మరొకటి అంటూ సుదీర్ఘ లేఖలో నయనతార పలు విషయాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కానీ తాను తన రెక్కల కష్టంతో ఈ స్థాయికి వచ్చానన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం తనకు సాయం చేస్తుంటే మీరు మాత్రం మీ కక్ష సాధింపులు మొదలుపెట్టారు అంటూ నయనతార కౌంటర్ ఇచ్చింది.
పదేళ్ల క్రితం ధనుష్ నిర్మాతగా నయనతార సినిమా చేసింది. దానికి విష్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. ఈ టైమ్‌లో నయనతార-విష్నేష్ దగ్గరయ్యారు. ఇది ధనుష్‌కు నచ్చలేదనే టాక్ వినిపించింది. వాళ్లు ప్రేమించుకోవడానికి తాను డబ్బులు పెట్టి సినిమా తీయాలా అనేది ధనుష్ ఫీలింగ్ అని కోలీవుడ్ వర్గాలు చెప్పుకున్నాయి. ఎందుకంటే అప్పటికే బడ్జెట్ చేయిదాటిపోయింది. దీంతో షూటింగ్ ఆపేశారు. అప్పటికే విష్నేష్‌తో ప్రేమలో ఉన్న నయనతార తను ఫైనాన్స్ చేసి ఆ సినిమాను గట్టెక్కించారని టాక్.
ఈ సినిమాలో నటనకు నయనతారకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. అదే అవార్డు ఫంక్షన్‌కు ధనుష్ కూడా వచ్చారు. నిండు సభలో వేదికపై ధనుష్ ఇగో హార్ట్ అయ్యేలా నయనతార మాట్లాడారు. తన యాక్టింగ్ నిర్మాతకు నచ్చలేదని, నెక్ట్స్ టైమ్ బాగా నటిస్తానంటూ ఓ చేతిలో అవార్డ్ పట్టుకుని ధనుష్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. అప్పటి నుంచి ధనుష్-నయనతార మధ్య గ్యాప్ వచ్చింది.
ప్రస్తుతం నయనతారకు ధనుష్ నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కొందరు నయనతారకు సపోర్ట్ చేస్తుంటే.. ధనుష్ ఫ్యాన్స్ మాత్రం నయనతారను ట్రోల్స్ చేస్తున్నారు. ధనుష్ ఏ తప్పు చేయలేదని తాము భావిస్తున్నామని.. మీరు డబ్బు కోసం డాక్యుమెంటరీ తీశారు. ధనుష్ ఎందుకు తన సినిమా నుంచి సీన్స్ వాడుకునేందుకు అనుమతిని ఇవ్వాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ధనుష్ కోలీవుడ్‌కు ఎంతో మంది టెక్నీషియన్లను, ఆర్టిస్టుల్ని అందించాడని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.
నయనతార లెటర్‌కు లైక్ కొడుతూ పలువురు హీరోయిన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య లక్ష్మి, నజ్రియా ఫహద్, అనుపమ పరమేశ్వరన్, పార్వతీ తిరువోతు, మంజిమా మోహన్, గౌరి కిషన్ నయన్‌కు మద్దతు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం సినీ ఇండస్ట్రీలో ట్రెండింగ్‌గా మారింది.