Bigg Boss 8 Telugu: నిఖిల్‌ను టార్గెట్‌ చేసిన సోనియా.. భలే ఇరికించేసిందిగా..

Bigg Boss 8 Telugu Sonia fires on Nikhil over Yashmi issue

Update: 2024-11-19 03:01 GMT

Bigg Boss 8 Telugu: నిఖిల్‌ను టార్గెట్‌ చేసిన సోనియా.. భలే ఇరికించేసిందిగా..

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌8 ఈ వారం మరింత ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్‌బాస్‌ హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన వారికి నామినేషన్‌ చేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఒక్కో కంటెస్టెంట్ హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాము ఎవరి నామినేట్‌ చేస్తున్నామో తెలిపి, అందుకు గల కారణాన్ని వివరించారు. దీంతో ఈ ఎపిసోడ్స్‌ హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి.

ఈ క్రమంలోనే గత ఎపిసోడ్‌లో సోనియా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. వేరేవాళ్లు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో దూరతావు. అలాగే చాలా పొగరుగా బిహేవ్ చేస్తావు అంటూ చిందులు తొక్కింది. ఇక తర్వాత నిఖిల్‌ను నామినేట్‌ చేసి ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యింది. నిఖిల్ డబుల్ స్టాండర్స్ అని.. ఫేస్ టూ ఫేస్ చెప్పే దమ్ములేదని.. నామినేషన్స్ కూడా సరిగ్గా చేయడు అంటూ రెచ్చిపోయింది.

యష్మీని అక్కా అన్నందుకు గౌతమ్ ను నామినేట్ చేశావ్ కదా..మరీ అలా వేరే అమ్మాయిల కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటూ గట్టిగానే స్పందించింది సోనియా. సోనియా మాటలకు నిఖిల్‌ ఒకింత సైలెంట్‌ అయిపోయాడు. యష్మీ నువ్వంటే ఇష్టం అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని నువ్వు మళ్లీ రోహిణి దగ్గర ఎందుకు మాట్లాడవు. ఓ అమ్మాయి ఎమోషన్స్‌కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అంటూ ఫైర్ అయ్యింది.

అయితే ఇందుకు బదులిచ్చిన నిఖిల్‌.. యష్మీకి ఎప్పుడో చెప్పానని చెప్పుకొచ్చాడు. అలా చెప్పి మళ్లీ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఎందుకు ఫ్లర్ట్ చేస్తావు అని సోనియా అడగ్గా.. నేను ఫ్రెండ్ గా ఉన్నాను అని అన్నాడు నిఖిల్. దీంతో ఒక్కసారిగా రియాక్ట్‌ అయిన యష్మీ నిఖిల్‌పై సీరియస్‌ అయ్యింది. నువ్వు ఎప్పుడూ నాకు చెప్పలేదు. అలా చెప్పి ఉంటే నేను నీ జోలికి వచ్చేదాన్ని కాదు. ఇక్కడ అందరి ముందు బ్యాడ్ అయ్యింది నేను అంటూ ఎమోషనల్ అయ్యింది యష్మీ.

అయితే సోనియా హౌజ్‌ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా యష్మికి, నిఖిల్‌కు మధ్య ఈ విషయంపై తీవ్ర వాగ్వదం జరిగింది. ఇలా మొత్తం మీద హౌజ్‌లోకి వచ్చిన సోనియా నిఖిల్‌ ఇరుకున పెట్టిందని చెప్పాలి. మరి మాజీ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ ఇంకెన్ని గొడవలకు దారి తీస్తుందో చూడాలి.

Tags:    

Similar News