Upasana Konidela: నాక్కూడా అలా కావాలని ఉంది.. అనన్య సిరీస్‌పై ఉపాసన రియాక్షన్
Upasana Konidela: మెగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేవలం మెగా కోడలిగానే కాకుండా వ్యాపారవేత్తగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
Upasana Konidela: మెగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేవలం మెగా కోడలిగానే కాకుండా వ్యాపారవేత్తగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వ్యక్తిగతంగా, వ్యాపారంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఉపాసన. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై నిత్యం తన అభిప్రాయాన్ని పంచుకుంటుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ వెబ్ సిరీస్‌ను వీక్షించిన ఉపాసన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించిన 'కాల్ మీ బే' అనే వెబ్ సిరీస్‌ను ఇటీవల చూశానని తెలిపిన ఉపాసన, తనకు ఆ సిరీస్ ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సిరీస్ చూసిన తర్వాత తనకు కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్ కావాలనే కోరిక కలిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు అనన్య.
ఇదిలా ఉంటే ఈ సిరీస్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సారా అలీఖాన్, అలియా, నేహా దుఫియా వారి ఇన్‌స్టాలో ఈ సిరీస్‌పై (Call Me Bae) పోస్ట్‌లు పెట్టారు. ఇలాంటి సిరీస్‌లో నటించినందుకు అనన్యను ప్రశంసిస్తున్నారు. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా’ ఉందని ప్రశంసిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
సిరీస్ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ ఓ ధనిక మహిళ చుట్టూ తిరుగుతుంటుంది. ధనవంతురాలైన ఓ మహిళ తన సంపదను కోల్పోయిన తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే అంశాన్ని ఇందులో చూపించారు. భర్త విడిచివెళ్లాక ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.