Unstoppable with NBK: బాలయ్య అన్‌స్టాపబుల్‌లో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఎన్ని సంచలనాలో

Unstoppable with NBK: తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా ఆకట్టుకుంటున్నారు నట సింహం బాలకృష్ణ.

Update: 2024-10-18 13:49 GMT

Unstoppable with NBK

Unstoppable with NBK: తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా ఆకట్టుకుంటున్నారు నట సింహం బాలకృష్ణ. ఎన్టీఆర్‌ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ఇన్నేళ్లయినా ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తున్నారు.

ఓవైపు రాజకీయం, మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. అన్‌స్టాపబుల్‌ టాక్ షోతో ప్రేక్షకులకు చేరువయ్యారు బాలయ్య. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ టాక్‌ షో ద్వారా ముఖ్యంగా యువతను బాలయ్య అట్రాక్ట్‌ చేశారని చెప్పాలి. ఇప్పటికే మూడు సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ టాక్‌ షో 4వ సీజన్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్స్‌ వ్యూస్‌ పరంగా సరికొత్త చరిత్రను సృష్టించాయి.

కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ సైతం ఇందులో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం సీజన్‌ 4 ప్రారంభానికి సిద్ధమైంది. ఈసారి మరింత రెట్టించిన ఉత్సాహంతో షో ఉండనుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఇందులో భాగంగానే స్పెషల్‌ గెస్ట్‌లతో షోను ఇంట్రెస్టింగ్‌గా మార్చనున్నట్లు తెలుస్తోంది. 4వ సీజన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌లో మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ తో పాటు ఆయన నటించిన లక్కీ భాస్కర్ టీమ్ హాజరైనట్లు షూటింగ్ కూడా పూర్తయినట్లు వార్తలు వచ్చాయి.

కాగా రెండో ఎపిసోడ్‌ షూటింగ్ కూడా పూర్తయిందని ఇందులో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఈ టాక్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీజన్‌ 4లో అందాల తార సమంత కూడా పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడీ వార్త అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది. నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్‌తో బాధపడ్డ సామ్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దీంతో ఈ టాక్‌ షో బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు. దానికి సామ్‌ ఎలాంటి సమాధానాలు చెప్పనుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

కాగా సీజన్‌లో 4లో పాల్గొనే స్టార్‌లకు సంబంధించి ఇంకొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో తమిళ స్టార్‌ హీరో సూర్య కూడా ఉన్నారు. ఈ నెల 24 సూర్యకు సంబంధించిన ఎపిసోడ్ ను షూట్ చేయబోతున్నారు. సూర్యతో పాటుగా ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా కంగువ దర్శకుడు శివ, నిర్మాత జ్ఞానవేల్ రాజా తో సహా టోటల్ టీమ్ పాల్గొంటుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఈ సీజన్‌లో హాజరుకానుందని టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News